Header Banner

చంద్రుడిపై అడుగు పెట్టిన బ్లూ ఘోస్ట్! అంతరిక్ష చరిత్రలో సంచలనం!

  Sun Mar 02, 2025 16:59        Others

చందమామపై మరో సరికొత్త ప్రయోగానికి తెర లేచింది. అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ పరిశోధనలకు పూనుకుంది. ఈ సంస్థ పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ బ్లూ ఘోస్ట్ విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది. పేలోడ్స్ సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్లు ప్రకటించింది.

 

ఇది కూడా చదవండి: దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

2023లో భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్.. చంద్రుడిపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దాని తరువాత మళ్లీ జాబిల్లిపై ఓ స్పేస్‌ క్రాఫ్ట్ ల్యాండ్ కాబోతోండటం ఇదే తొలిసారి. తాజా పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రబిందువు అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

 

అమెరికా టెక్సాస్‌కు చెందిన ఫైర్ ఫ్లై అనే సంస్థ ఈ బ్లూ ఘోస్ట్ స్పేస్ క్రాఫ్ట్‌ను చందమామ మీదికి పంపించింది. ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఫ్లోరిడా మెరిట్ ఐలాండ్స్‌లో గల నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిందీ బ్లూ డ్రాగన్. కొద్దిసేపటి కిందటే జాబిల్లిపై అడుగు మోపింది. నాసాకు చెందిన 10 మంది సైంటిస్టులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. అక్కడి నుంచి తొలి ఫొటోను పంపించింది కూడా. దీన్ని ఫైర్ ఫ్లై సంస్థ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసింది.

బ్లూ ఘోస్ట్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా దీన్ని తీసింది. ఇందులో కొంతభాగం బంగారు రంగులో మెరిసిపోతున్న స్పేస్‌క్రాఫ్ట్ బయటి భాగం, మరి కొంతభాగం చంద్రుడి ఉపరితలం కనిపించింది. ల్యాండ్ అయినప్పుడు చెలరేగిన ధూళి ఇందులో రికార్డయింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #BlueGhost #NASA #MoonLanding #SpaceMission #LunarExploration #ShockingDiscovery #FireflyAerospace #MoonMission #SpaceInnovation #AstronomyNews